ఇక ఐకాన్ పై ఫోకస్ పెట్టిన దిల్ రాజు…
టాలీవుడ్ లో దిల్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. అతని సినిమాలకు ఓ లెక్క ఉంటుంది. సరిగ్గా అంచనాలతో రంగంలోకి దిగడం ఆయన నైజం. ఆయన వేసే ప్రతి అడుగుకూ సరియైన ఆర్థిక అంచనాలు ఉంటాయి. అందుకే ఆయన చేతిలో పడితే అది దశలో ఉన్నా దాని దశ మారుతుంది అంటారు. నిజమే. ఇక వకీల్ సాబ్ తర్వాత భారా ప్రాజెక్ట్ ను చేపట్టనున్నారు దిల్ రాజు. అదే ఐకాన్.
తమ తర్వాతి సినిమాగా ‘ఐకాన్’ స్టార్ట్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్ లో ఈ విషయంపై స్పందిస్తూ… ‘వ్యక్తిగతంగా ఈ స్ర్కిప్ట్ కి తాను బాగా కనెక్ట్ అయ్యానని.. వేణుశ్రీరామ్ చెప్పిన లైన్ బాగా నచ్చిందని అన్నారు. దాంతో ఆ స్టోరీకి సంబంధించి పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశామని ఇక మొదలు పెట్టడమే తరువాయి’ అంటా వివరించారు. కాగా అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను కొంచెం వెనక్కి జరపవలసి వచ్చిందని.. ఇప్పుడు ఇక ఆగేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ‘వకీల్ సాబ్’ ప్రచారంలో అటు దర్శకుడు, ఇటు నిర్మాతకు ఎదురైన ప్రశ్న ‘ఐకాన్’ కావటం విశేషం. రిలీజ్ కి ముందు ‘నో ఐడియా’ అని చెప్పిన దిల్ రాజు… ‘వకీల్ సాబ్’ రిలీజ్ తర్వాత మాత్రం లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు ఇక ‘ఐకాన్’ కి రెడీ అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే బన్నీ కూడా ‘పుష్ప’ తర్వాత వేరే ఏ దర్శకుడుని లాక్ చేయక పోవడంతో ‘ఐకాన్’ పట్టాలెక్కడం ఖాయమనే టాక్ నడుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.