ఆ ప్రేమ జంట వ్యాక్సినేషన్ పిక్స్ వైరల్…
దేశంలో కరోనా చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. కరోనాకు ఇప్పటికే ఎంతోమంది సెలబ్స్ బలయ్యారు. దీంతో వ్యాక్సిన్ పై సెలబ్స్ దృష్టి పెట్టారు. ఇప్పటికే రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు వంటి స్టార్స్ సెకండ్ డోస్ వాక్సిన్ తీసుకున్న వారిలో ఉన్నారు. తాజాగా కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అదేవిధంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు సంపాదించకున్న బ్యూటీ నయనతార, యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడం, ఏ కార్యక్రమంలోనైనా కలిసే పాల్గొనడంతో మరింత హాట్ గా వారు మీడియాలో వైరల్ అవుతుంటారు. చాన్నాళ్లుగా వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఎప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు.