గంగపుత్రుల పోస్ట్ కార్డ్ ఉద్యమం
భీంగల్
తెలంగాణ ప్రభుత్వం గంగపుత్రుల పొట్ట కొట్టే విధంగా చట్టాలు అమలు చేస్తూ గంగపుత్రుల బతుకులను రోడ్డు మీదకు ఇడ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోస్టు కార్డు ఉద్యమo, నిరసనలో భాగంగా భీంగల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు పోస్ట కార్డులు పోస్ట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా జిల్లా నాయకులు పల్లికొండ నర్సయ్య మాట్లాడుతూ గంగపుత్రుల పొట్టలు కొట్టే విధంగా ఉన్న జీవో నంబర్ 6 ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు .అలాగే గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో గంగపుత్రుల మీద పెత్తనం చెలాయిస్తూ వారికి నచ్చినట్టు చేపలు నమ్మాలని అని బెదిరిస్తున్నారని, అలాగే వారిపై వేలకు వేలు జరిమానా విదిస్తున్నారని,కట్టని ఎడల గ్రామా బహిష్కరన చేస్తున్నారని అన్నారు. ఇట్టి చట్టవ్యతిరేక కమిటీని తక్షణమే రద్దుచేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు.మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర లింబాద్రి ,బి. గంగారాం, ప్రశాంత్ కుమార్, రాములు ,శ్రీనివాస్ గంగాధర్, వరలక్ష్మి, ప్రేమ,మరియు గంగపుత్ర చైతన్య సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.