మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వం ప్రారంభించిన మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఇసంపెల్లి వేణు
కరీంనగర్: MAFI జాతీయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం రోజున కరీంనగర్ జిల్లాలో మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సభ్యత్వం ప్రారంభించడం జరుగుతుంది. జూన్ జూలై ఆగస్టు మూడు నెలల పాటు జాతీయ రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో సభ్యత్వం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టులపై ప్రభుత్వాలు పోలీసులు రౌడీలు భూ మాఫియా గుండాలు కలిసి అక్రమంగా కిడ్నాప్ లకు పాల్పడుతూ దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులు ప్రజలను రక్షించ వలసింది ఉండగా రౌడీ లాగా నిజాయితీగా జనం కోసం గొంతు వినిపిస్తున్న జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శించారు. జర్నలిస్టు రఘు భూ మాఫియా పై టీవీలో కథనాలు వినిపిస్తే తప్పెలా అవుతుందని ఆయన విమర్శించారు. జర్నలిస్టులు రఘును ఏ తప్పు చేశాడని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పంపారని దీనిపై కెసిఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ఆరోపించారు. పేద ప్రజల భూములను లాక్కున్న బడా భూమా ప్రియ గుండాలను ఎందుకు అరెస్టు చేయలేదని. అదే పేదల కోసం జర్నలిస్టులు అభ్యుదయవాదులు మేధావులు జనం పక్షాన గొంతు వినిపిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వం నిర్బంధాల తో నియంత పాలన కొనసాగిస్తుందని ఆయన అన్నారు. జర్నలిస్టు లారా ముందు మనం మారాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉంటూ కొన్ని పత్రికలు కొన్ని టీవీలు వారికి వత్తాసు పలుకుతున్నాయి. ఈ పద్ధతి మార్చుకోవాలని మన తోటి జర్నలిస్టులపై దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు పెడుతుంటే నీకు నిద్ర ఎలా పడుతుంది జర్నలిస్టు అన్న ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుందాం. జర్నలిస్టుల ఐక్యత పాలకుల గుండెల్లో కదిలిద్దాం. పేద ప్రజల పక్షాన పోరాడుదాం. జర్నలిస్టు సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం అవుదాం. జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులను ఎత్తివేయాలని భవిష్యత్తు పోరాటాల కార్యచరణను తీసుకోవాలని ఇసంపెల్లి వేణు జర్నలిస్టులకు జర్నలిస్టు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను.