కేరళ అందాలతో సేద తీరుతోన్న అనసూయ…
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా అందరినీ అలరిస్తూ, సినిమాల్లోనూ తగిన పాత్రలను రొమాంటిక్ గా నటిస్తూ అలా అలా దూసుకుపోతున్న నటీమణి అనసూయ. టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ రోల్ ను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అనసూయ. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లకు కూడా ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమెసొంతం. సహనటీమణులకు అసూయ కలిగించే అందం అనసూయ సొంతం.
అయితే ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈమధ్యే రవితేజ ఖిలాడి సినిమా కోసం ఇటలీ వెళ్లొచ్చిన ఆమె తాజాగా తన ఫ్యామిలీతో కలిసి కేరళను చుట్టేసింది. అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘థ్యాంక్యు బ్రదర్’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగ మార్తాండ’లో అనసూయ కీలక పాత్రలో మెరవబోతున్నారు. అంతేకాకుండా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న సినిమాలో కూడా అనసూయ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి బుల్లితెర మీదే కాకుండా సినిమాల్లో కూడా అనసూయ చాలా బిజీబిజీగా గడుపుతుండటం విశేషం.