smile smile smile smile smile smile smile smile smile smile smile

ట్రక్ నడిపి శెభాష్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్…..

మహిళా సాధికారత దిశగా స్త్రీలు అన్ని రంగాల్లో ప్రస్తుతం తమ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ వంటి బండిని నడిపింది. ఓ సినిమా కోసం రకుల్ ఇలాంటి సాహసం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏమిటది అంటే.. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ బాలీవుడ్ సినిమాలో అర్జున్ కపూర్ తో కలసి నటిస్తోంది రకుల్. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అయితే కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ సీన్ లో భాగంగా రకుల్ ట్రక్ డైవింగ్ చేసింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ‘వ్యక్తిగతంగా నాకు డ్రైవింగ్ చేయటం అంటే ఎంతో ఇష్టం. అయితే ట్రక్ డ్రైవ్ చేయటం అంత ఈజీ కాదు. ఎంతో నేర్పరితనం, సాహసం ఉండాలి. ఎంతో ఎటెన్షన్ కావాలి. ఇది ఒక కొత్త అనుభవం’ అంటూ రకుల్ వెల్లడించింది. ఈ సన్నివేశంలో ట్రక్ ని రకుల్ ఎంతో జాగ్రత్తగా ఎలాంటి టెన్షన్ లేకుండా నడిపి యూనిట్ ప్రశంసలు అందుకుంది రకుల్. అనుభవం ఉన్న ట్రక్ డ్రైవర్ సెట్స్ లో ఉండి నేర్పించినప్పటికీ అమ్మడి డ్రైవింగ్ నేర్పరితనానికి అందరూ ఆశ్చర్యపోయారని తెలుస్తుంది. కాగా ఈ అనుభవం రకుల్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందని టాక్. మరి మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ స్టైలే వేరబ్బా అంటూ మురిసిపోతున్నారు ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *