ట్రీట్మెంట్ ఫస్ట్.. టెస్ట్ నెక్ట్స్ త్వరపడండి : సీఎస్ సోమేష్ కుమార్
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా సీఎస్ సోమేష్ కుమార్ విలేఖరులతో మాట్లాడారు. ప్రజలంతా వైరస్ సోకకుండా జాగ్రత్తులు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతకంటే ముందు కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే ట్రీట్మెంట్ లోకి వెళ్లమని చెప్పారు ఆయన. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడిసిన్స్ వేసుకోవాలని, అందుకు సంబంధించిన డోస్ లను ఆయన వివరించారు. కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా అందుకు సంబంధించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెడిసిన్ వేసుకోమని తెలిపారు. రెమ్డెసివర్, ఆక్సిజన్ వెంపర్లాటలతో ఎలాంటి ఫలితం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అలాగే లోకాస్త్ యాంటీ కరోనా కిట్ తో ఎంతో ప్రయోజనం అని కూడా ఆయన తెలిపారు.
అసలు కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే డాక్సీసైక్లిన్ మెడిసిన్ 5 రోజులకు సరిపడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని డైలీ రెండు పూటలు వేసుకోవాలని అన్నారు. అలాగే పారాసిటమాల్, విటమిన్ సి, మల్టీ విటమిన్ మెడిసిన్ 10 రోజులకు సరిపడా తెచ్చుకొని రెండుపూటలా వేసుకోవాలని అన్నారు. అలాగే లెవో సిట్రజన్, ర్యాంటడిన్, విటమిన్ ఉదయం, సాయంత్రం 10 రోజుల చొప్పున తీసుకోవాలని అన్నారు. ఇక జ్వరం 5రోజులు అయినా తగ్గకపోతే మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఉదయం, సాయంత్రం 5 రోజులు వాడాలని అన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ మందులను వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, వైరస్ కు చెక్ పెట్టవచ్చని, అన్నింటికన్నా ముఖ్యంగా ధైర్యమే మనిషిని బ్రతికిస్తుందని సీఎస్ స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం కరోనా కంట్రోల్ లోనే ఉందని, కరోనాపై వైద్యులు, అధికారులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా సరే ఖర్చు చేయమని సీఎం చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. మొత్తానికి లాక్ డౌన్ పై ఈనెల 8వ తేదీలోపు స్పష్టత రానున్నట్లు సీఎస్ వివరించారు.