ఇట్స్ క్లియర్… రెండు భాగాలుగా పుష్ప
టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. మైత్రీ మూవీస్ పతాకంపై సుకుమార్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం కొద్దిపాటి సన్నివేశాలు తప్పితే మిగతా అంతా పూర్తయింది.
అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ‘బాహుబలి’లా ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుందంటూ వైరల్ అవుతోంది. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలను దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తామంటున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి. కాగా అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేసేందుకు సినిమా యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.