అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్‌టీఆర్ఎస్ అధినేత టైగర్ అశోక్
ఆర్మూర్ (చంద్రన్యూస్ నెట్‌వర్క్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర సమైఖ్య పార్టీ అధ్యక్షుడు టైగర్ అశోక్ నేత (ఏసీపీ) నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. అందరికీ సమాన హక్కులు ఉండాలని బాబాసాహెబ్ చెప్పారని అశోక్ అన్నారు. బోధించు, సమీకరించూ, పోరాడు అని చెప్పారని, ఆయన మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయసాధన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు ప్రభుత్వాలు అవకాశాలు అందించాలని కోరారు.