తిరుపతి ఉప ఎన్నికపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రేపే పోలింగ్ జరగబోతుంది. ఈ ఉప ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
అదేవిధంగా ఓటర్లను ప్రభావితం కాకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇలాంటి సమయంలో తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ వాలంటీర్లను రంగంలోకి దింపారని, ఒక్కో వాలంటీర్ కు రూ. 5వేలు ఇచ్చి పోలింగ్ జరిపేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా తిరుపతి లోక్ సభ పరిధిలోని వాలంటీర్లకు మొత్తం రూ. 11కోట్లు చేరవేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని జరుగుతున్నా ఎన్నికల సంఘం ఏమీ పట్టకుండా ఉండటం సరికాదని సోమిరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఈ ఉప ఎన్నిక గెలుపుకోసం సార్వత్రిక ఎన్నికలతో సమానంగా ప్రచారం నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. కాగా రేపు జరిగే పోలింగ్ లో ఓటర్లు ఎవరికీ అండగా ఉంటారనేది వేచి చూడాల్సిందే.