అనుష్క పెళ్లి… దుబాయ్ వరుడు… వార్త వైరల్…..
టాలీవుజ్ స్టార్ హీరోయిన్ స్వీటీ.. అనుష్క. ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయం ఇన్నాళ్లూ నిత్యనూతనంగా బర్నింగ్ టాపిక్ లా వినిపించింది. అయితే ఈ భామ పెళ్లి విషయం ఎన్ని సార్లు విన్నా ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టకుండా అనిపిస్తుంది. సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన అనుష్క శెట్టి ‘భాగమతి’ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది.
అయితే ‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అనుష్క తాజాగా ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకాళిని ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు విషయం ఏమిటంటే… ఇప్పటికే చాలా సార్లు అనుష్క పెళ్లి విషయం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆమె పెళ్లి టాపిక్ అనేది నిరంతర ప్రవాహిని. అలా సాగుతూ ఉంటుంది. అయితే ఎన్నిసార్లు అనుష్క పెళ్లిపై వార్తలు వచ్చినా క్లారిటీ మాత్రం ఇప్పటివరకు రాలేదు. తాజాగా మరోసారి అనుష్క పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. కొంతకాలంగా మంచి సంబంధం కోసం చూస్తున్న స్వీటీ కుటుంబానికి ఓ అబ్బాయి దొరికాడనే టాక్ వినిపిస్తుంది. అయితే వరుడు దుబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. దీంతో అతడితోనే స్వీటీ పెళ్లి చేయాలని.. అనుష్క కుటుంబం డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతను స్వీటీ కంటే వయసులో చిన్నవాడనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. మరి అన్నీ కలిసి వస్తే.. చాలా కాలానికి అనుష్క పెళ్ళికి ముహూర్తం కుదిరినట్లే అనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే స్వీటీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.