smile smile smile smile smile smile smile smile smile smile smile

పూజాని గోల్డెన్ లెగ్ ఎందుకంటున్నారు?

అదృష్ణం కలిసొస్తే అన్నీ వెంట నడిచొస్తాయి. ప్రతిభతో పాటు లక్ కలిసొస్తే రంగుల ప్రపంచంలో దూసుకెళ్లొచ్చు.ప్రస్తుతం కెరీర్ పరంగా అలాంటి సక్సెస్ ఫుల్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన నాలుగైదేళ్లకు ఈ బ్యూటీ క్రేజు అమాంతం పదింతలైంది. జీవా హీరోగా మిస్కిన్ రూపొందించిన తమిళ చిత్రం `ముగాముడి`తో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పూజా హెగ్డే ఆ తరువాత `ఒక లైలా కోసం` చిత్రంతో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తొలి చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా పూజకు మాత్రం వరుస ఆఫర్లని తెచ్చిపెట్టింది.

ముకుంద.. `దువ్వాడ జగన్నాథం` చిత్రాలతో పూజా టాలీవుడ్ లో పాగా వేసింది. ఆ తరువాత చేసిన చిత్రాలు సాక్ష్యం.. అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో .. ఇలా వరుసగా విజయాలు సాధించడం.. బన్నీతో కలిసి చేసిన `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పూజ టాలీవుడ్ కు మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా దర్శకుల పాలిట బుట్టబొమ్మగా మారిపోయింది.

సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కూడా సక్సెస్ కావడంతో పూజని గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పట్లో అఖిల్ కు హిట్ వస్తుందా అనే అనేమానాల్ని వ్యక్తం చేసిన టాలీవుడ్ వర్గాలు పూజా కారణంగానే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సక్సెస్ అయిందని కథనాలు అల్లేస్తుండడం ఆసక్తికరం. దీంతో పూజ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇదిలా వుంటే ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే మళ్లీ హీటు పెంచేసింది.

ఈ మూవీ సక్సెస్ ఆనందంలో ప్రత్యేకంగా ఫొటోషూట్లతో విరుచుకుపడుతోంది. బ్లాక్ బికినీ ధరించి ఇదిగో ఇలా థై షోస్ చేస్తూ వయ్యారంగా ఫొటోలకు పోజులిచ్చింది. బికినీపై లాంగ్ కోట్ తో కవర్ చేసినా పూజా అందాలు దాగడం లేదు. పూజా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. పూజ తమిళ క్రేజీ హీరో ఇలయదళపతి విజయ్ నటిస్తున్న `బీస్ట్`లో చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో పూజ నటించిన రాధేశ్యామ్- ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

You may also like...

1 Response

  1. pallura says:

    Additionally, the technology could offer information to the visually impaired about their location, helping them to better discern their surroundings by touching the touchscreen cialis viagra combo pack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *