smile smile smile smile smile smile smile smile smile smile smile

ప్రధాని మోదీ నిర్లక్ష్యమే ఈ ఘోరకలికి కారణం!!

అవును మన భరత మాత ముద్దుబిడ్డలు వైద్యం అందక తండ్రుల కళ్ల ముందే, భార్యల ఒడిలో, తల్లుల చేతుల్లో విల విలలాడుతూ ప్రాణాలు వదులుతుంటే … యావత్ భారతమే అనాధలా రోధిస్తుంటే …ఒక విపక్షంగా పాలక పార్టీ నాయకుణ్ని నిలదీస్తాం. ఇది ప్రజాస్వామిక హక్కు.

మన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన పాలనాకాలంలో దేశ సొమ్మును విదేశాలకు ఇచ్చిన వివరాలు కొన్ని మీ ముందు పెడుతున్నాం.

భూటాన్ కోసం 10 వేల కోట్ల రూ. ఇచ్చారు.
అలాగే
మంగోలియాకు రూ. 17,000 కోట్లు,
బంగ్లాదేశ్ కు రూ. 15,000 కోట్లు,
మారిషస్ కు రూ. 5000 కోట్లు,
నేపాల్ & ఆఫ్రికా దేశాలకు రూ. 39000 కోట్లు ఇచ్చారు.

ఇక సర్దార్ పటేల్ విగ్రహం కోసం రూ. 3000 ఖర్చు చేశారు.
బ్యాంక్ ల ఎగవేత దారుల కోసం 5,55000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు.
మోదీ గారు తన విదేశీ పర్యటనలకు రూ. 25,000 కోట్లు ఖర్చు చేశారు.
బీజేపీ కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేశారు.
మోదీ, బీజేపీ నాయకుల దేశీయ పర్యటనలకు రూ. 500 కోట్లు ఖర్చు చేశారు.
మోదీ సెక్యూరిటీ ఖర్చు రోజుకు ఒక కోటి రూపాయల చొప్పున సంవత్సరానికి ఇతర ఖర్చులు కలుపుకొని సుమారు రూ. 500 కోట్లు వాడుకుంటున్నారు.
గత ఐదేళ్లలో వివిధ కుంభమేళాల కోసం రూ 15,000 ఖర్చు చేశారు.
ట్రంప్ పర్యటన కోసం మోదీ ఖర్చు చేసింది రూ. 100 కోట్లు.

మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టే పొరుగు దేశాల కంటే మన దగ్గర ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ దేశ జనాభాలో 25 శాతం మంది ప్రజలు రోజూ అర్థాకలితో నిద్రిస్తున్నారు.

సిగ్గనిపిస్తుంది పాలు కూడా దొరకని పసిపాపల కోసం యూనిసెఫ్ కు చెందిన సేవ్ చైల్డ్ సంస్థ ఒక పాపకు నెలకు రూ. 800 డొనేట్ చేయండని రోజూ టీవీ ఛానల్లో ప్రకటనలు ఇస్తుంటే. పసిపాపల పాల కోసం బడ్జెట్ కేటాయింపు చేయలేని దేశమా మనది?

మోదీ గారి పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయింది. జీడీపీ అధపాతాళంలో ఉంది. డీమోనటైజేషన్ తో అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. జీ ఎస్టీతో మరి కొన్ని దేశీయ పరిశ్రమలకు తాళాలు పడ్డాయి. ఒక్కసారిగా లాక్డౌన్ ప్రకటించడంతో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి మాటల్లోనే 6లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఎన్ని లక్షల కుటుంబాలు పేదరికంలోకి నెట్టివేయబడ్డాయో ఆలోచించారా?

ఇక పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయల దగ్గర ఉన్నాయి. ప్రతి వస్తువు ధర గత ఆరునెలలతో పోల్చితే రెట్టింపు అయింది. కొత్త ఉద్యోగాలు లేవు. మరోవైపు కొట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక లాక్డౌన్ కాలంలో మన దేశంలో ఎన్ని కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారో తేటతెల్లం అయింది. ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ఏడాదిలో చేపట్టిన కార్యాచరణ ఏది? మళ్లీ వలస కార్మికులు ఎందుకు సొంతూళ్లకు క్యూ కడుతున్నారు? ఇక మోదీ గారి పాలనా కాలంలో గత ముప్పై ఏళ్లలో జరిగిన నష్టం కంటే ఎక్కువ మంది సైనికులను సరిహద్దుల్లో కోల్పోయాం.
ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గతంలో ఎన్నడూ లేనంతగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భరత జాతిని రకరకాల పేర్లతో వారి మధ్య విబేధాలు స్రుష్టించి అఖండ జాతిని ఖండ ఖండాలు చేస్తున్నారు. హిందూ, ముస్లింల పేరు చెప్పి మరో సారి దేశ ప్రజల మధ్య నిట్టనిలువునా విభజన చేస్తున్నారు.

“అవును జాతి మారుతోంది – దేశాన్ని అమ్మడంతో ”

మన ప్రియతమ ప్రధాని రైల్వేలను అమ్మారు.
రైళ్లను అమ్మారు.
ఎర్రకోటను అమ్మారు.
ఎయిర్ పోర్టులను అమ్మారు.
బొగ్గు గనులను అమ్మారు
ముంద్రాగావ్ ఓడరేవును అమ్మారు.
బీఎస్ఎన్ఎల్ ను అమ్మకానికి పెట్టారు.
ఎల్ఐసీని అమ్మకానికి పెట్టారు.
ఓఎన్జీసీని అమ్మకానికి పెట్టారు.
ఐడీబీబీని అమ్మకానికి పెట్టారు.
ఎయిర్ ఇండియాను అమ్మకానికి పెట్టారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు.
అనేక బ్యాంక్ లను మూసి ఉన్న వాటిని కార్పొరేట్ శక్తులకు తెగనమ్మటానికి సిద్ధం అవుతున్నారు.
డిఫెన్స్ లో ప్రైవేట్ కు అవకాశం కల్పిస్తిరి.
డిఫెన్స్ సంస్థలు స్వదేశీయంగా రూపొందించిన అనేక క్షిపణులను, యుద్ధ ట్యాంకులను, విమానాలను రక్షణ శాఖ కొనకపోవడంతో అవి తుప్పుబడుతున్నాయి. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు విదేశాలకు చెందిన మన వాటి కన్న సామర్థ్యం తక్కువ ఉన్న వాటిని కొంటున్నాం.
ఇక ఏం మిగిలాయి దేశంలో.
75 ఏళ్లుగా జాతి నిర్మించుకున్న సంస్థలను పటిష్టం చేస్తూ కొత్త వాటిని స్థాపించాల్సింది పోయి, ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటీ మిగల్చకుండా అమ్ముతామని స్వయంగా శ్రీ మోదీ గారే చెప్పారు.

అవును “దేశం తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ ఉన్నట్లు” కరోనాతో ప్రజలు అనాధలుగా బాధపడుతున్న తరుణంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కు ఇవ్వడం ఆపమని మంత్రే మాట్లాడుతుంటే ఏమనాలి?
ఇది కాదా మోదీ నిర్లక్ష్యం? ఏడాదిన్నర క్రితం ప్రపంచంతో పాటు మన దేశంలోకి అడుగుబెట్టింది ఈ మాయదారి భూతం. ఫస్ట్ వేవ్ లో చాలా అనర్థాన్నే మిగిల్చింది. ప్రాణ, ఆర్థిక నష్టం బాగా జరిగింది. విపక్షాలతో పాటు ప్రజలు ఆయా ప్రభుత్వాలకు సహకరించారు. వైరస్ కొంత నెమ్మదించింది. సెకండ్, థర్డ్ వేవ్లు ఉంటాయని ప్రభుత్వాలే ప్రకటించాయి. సోయి ఉన్న పాలకులు ముందు చూపుతో వైద్యరంగాన్ని పటిష్టం చేయాలి. ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రధాన్యత ఇస్తూ బడ్జెట్ పెంచాలి. ప్రభుత్వ రంగ ఆస్పత్రులను బలోపేతం చేయాలి. సిబ్బంది రిక్రూట్మెంట్ జరగాలి. కొత్త ఆస్పత్రులను నిర్మించాలి. ప్రైవేట్ వైద్య వ్యాపారాన్ని నిలవరించడానికి కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఒకటికి రెండు సార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించి దేశ ప్రధానిగా మోదీ గారు దిశా నిర్దేశం చేయాలి. ఫస్ట్ వేవ్ లో మన కంటే తీవ్రంగా బాధపడ్డ దేశాలు ఎంత బాధ్యతగా వ్యవహరించి ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్రతను తగ్గించుకున్నాయి. పైగా మన దేశంలోనే వ్యాక్సిన్ తయారైంది. అవసరమైతే ఇతర ఖర్చులు తగ్గించుకుని, యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించాలి. అది చేయకుండా మోదీ గారే రోజుకో వేషంలో ముక్కుకు మాస్కు కూడా లేకుండా ఒక వ్యాపారి వలే రోజో సంస్థను అమ్ముకుంటూ ఉండటంతో పాపం సామాన్యులు పొట్ట కూటికోసం రోడ్ల మీద యథారాజ తథా ప్రజా అన్నట్లుగా తిరిగారు. ఫలితం యావద్దేశం అనుభవిస్తోంది. ఇందులో మోదీ గారి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

మీ అమ్మానాన్నల పెంపకం అనాలో లేక మీ పార్టీ విధానం అనాలో తెలియడం లేదు. అన్ని బూతులా? అన్ని బెదిరింపులా?
మా విమర్శ మీకు ఇబ్బంది కలిగిస్తే మీ విధానాలతో సమాధానం చెప్పండి. తిట్టినా ఏ ఒక్కరన్నా తమ విధానాలు చెబుతారేమోనని వెతికా. ఒక్కటి లేదు. అయినా మేము బాధపడలేదు. మా నాయకులు అందరి వివరాలు సేకరించి కేసు నమోదు చేద్దామన్నారు. వద్దులే ప్రక్రుతిలో ప్రతి వస్తువు దాని ధర్మం ప్రకారం ఉంటదని, మల్లెల నుంచి సుగంధాలు వస్తాయి, పాయకాన్ల నుంచి పీతి వాసన వస్తుందని మా వాళ్లకు చెప్పడంతో అర్థం చేసుకున్నారు.

అయినా ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఉత్తమ ఆలోచనలతో ఎదిగిన వారిగా చెబుతున్నాం. సామాన్యుని ఆత్మ గౌరవ పాలన తెచ్చే వరకు భారత మాత ముద్దు బిడ్డలుగా ముందడుగు వేస్తూనే ఉంటాం.

వివేకనంద ఉత్తేజం
భగత్ సింగ్ తెగింపు
మహాత్మా పూలే ఆలోచన
అంబేద్కర్ ఆచరణ
కుమ్రం భీం గాండ్రింపు
సర్దార్ సర్వాయి పాపన్న రాజరికం
మా మహా ప్రయాణ ఆయుధాలు!

మీ.మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *