smile smile smile smile smile smile smile smile smile smile smile

ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ టీజర్ రివ్యూ

‘‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’’ అంటూ ప్రభాస్‌ డైలాగ్‌లు చెప్పేశాడు. యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ ఎట్టకేలకు విడుదలయ్యింది.

సన్నివేశాలకు అనుగుణంగా జస్టిన్‌ ప్రభాకరణ్‌ అందించిన సంగీతం హత్తుకునేలా ఉంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి(palmist) పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *