F3 ఫన్ తట్టుకోలేరు! – పూజా హెగ్డే కూడా!
‘F2’ సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా F3 మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఇది కాస్తా ఆలస్యం అయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ‘F3’ పేరిట ఈ సినిమాను రెండేళ్ల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా వెంటనే మొదలు పెట్టేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ‘F3’లో ముగ్గురు హీరోలు నటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇందులో ఇద్దరే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక, కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ సినిమా సన్నివేశాలను షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు.
‘F2’ మాదిరిగానే దానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘F3’ను కూడా దర్శకుడు అనిల్ మరింత ఫన్నీగా రూపొందిస్తున్నాడు. ఇందులో భాగంగానే హీరో వెంకటేష్‌కు రేచీకటి సమస్యను ఇందులో యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సునీల్‌తో సరికొత్త ట్రాకును తీసుకొచ్చి నవ్వించబోతున్నాడట. క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రాబోతున్న ‘F3’ మూవీని మరింత ఫన్నీగా రూపొందించారట. ‘F2’ కంటే మరింతా ఫన్నీగా ఈ సినిమా ఉంటుందని, తట్టుకోవడం కష్టమేనంటోంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాను మే 27న విడుదల చేయబోతున్నారు. ఇక, దీని నుంచి తెలుస్తోన్న అప్‌డేట్ల కారణంగా ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడుతున్నాయి.
వరుణ్ తేజ్ – వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘F3’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇప్పటికే దీనికి ఆమె సైన్ కూడా చేసిందని టాక్. ‘F3’లో స్పెషల్ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేశాడట. దీని కోసం పూజా హెగ్డేను ఇటీవలే నిర్మాత దిల్ రాజు ఒప్పించారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారని తెలుస్తోంది. కేవలం నాలుగు నిమిషాల పాట కోసం ఆమె అంత తీసుకుంటుందన్న వార్త హాట్ టాపిక్ అవుతోంది.