జరివరం శారీస్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ – ప్రభాస్ పెళ్లి బట్టలు కొనే స్టోర్ ఇదే..
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి స్టోర్ ప్రారంభించిన కృష్ణంరాజు సతిమణి శ్యామల దేవి
హైదరాబాద్: (జూలై 25, 2024): జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32లో జరివరం శారీస్ స్టోర్ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. మేయర్ తో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి, యువ నటుడు రక్షిత్ అట్లూరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ స్టోర్‌ను అభిలాష రెడ్డి, గాయత్రి (నటుడు కృష్ణుడు భార్య) కలిసి ప్రారంభించారు. ఈ స్టోర్‌లో కంచి పట్టు, ఆర్గంజా, బ్రైడల్ డిజైన్లతో సహా వివిధ రకాల కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. జరివరం ఒక వన్ స్టాప్ షాప్ అని, కంచి పట్టు మా ప్రత్యేకత అని నిర్వాహకులు చెప్పారు. పెళ్లిళ్లకు సంబంధించిన అన్ని అవసరాలు మా స్టోర్‌లోనే తీర్చుకోవచ్చని వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, “ఇక్కడి కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అన్ని మహిళలు ఈ స్టోర్‌కి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక జ్యూవెలరీ స్టాల్ కూడా ఉంది, ఆ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యారేజ్ డ్రెస్‌లే కాకుండా ఫాన్సీ డ్రెస్సులు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వీవింగ్ చేసి కస్టమర్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. వీరి కలెక్షన్స్ నాకు చాలా నచ్చాయి” అని తెలిపారు.
శ్యామల దేవి మాట్లాడుతూ, “జరివరం స్టోర్‌కి నన్ను గెస్టుగా ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా కంచి పట్టు చీరల వెరైటీలు అద్భుతంగా ఉన్నాయి. కృష్ణంరాజు నాకు తొలిసారి కొన్న కంచి పట్టు చీర నేనే ఇక్కడ వేసుకున్నాను. ప్రభాస్ పెళ్లి బట్టలు కూడా ఇక్కడ నుండే కొంటాము” అని చెప్పారు. అభిలాష రెడ్డి, గాయత్రి ఈ స్టోర్‌ను అద్భుతంగా ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు.
రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ, “జరివరం స్టోర్ ఓపెనింగ్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి చీరల కలెక్షన్స్ చాలా యూనిక్‌గా ఉన్నాయి. వైవిధ్యం కోరుకొనే మహిళలకు ఈ జరివరం కలెక్షన్స్ తప్పకుండా నచ్చుతాయి” అని తెలిపారు.
నటుడు కృష్ణుడు మాట్లాడుతూ, “అభిలాష రెడ్డి, నా భార్య గాయత్రి కలసి ఈ స్టోర్ ప్రారంభించారు. ఇక్కడి కలెక్షన్స్ కోసం చాలా కష్టపడ్డారు. హైదరాబాద్ మహిళలకు ఉత్తమ కలెక్షన్స్ అందించాలనే ఉద్దేశంతోనే జరివరం ప్రారంభించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శ్యామల దేవి, రక్షిత్ అట్లూరి.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అభిలాష రెడ్డి, గాయత్రి మాట్లాడుతూ, “మా ఆహ్వానం మన్నించి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. కస్టమర్స్‌కి ది బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా నెలల నుండి హార్డ్ వర్క్ చేసి జరివరం స్టార్ట్ చేశాం. కంచి పట్టు మా ప్రత్యేకత. వన్ స్టాప్ షాప్ లా జరివరం ఉంటుంది. మా పేరులో ఎంత నిజాయితీ ఉందో మా కలెక్షన్స్‌లో కూడా అదే చూపించబోతున్నాం. ఒక్కసారి మా జరివరంకు వస్తే అది మీరు కచ్చితంగా చెబుతారు” అని తెలిపారు.