smile smile smile smile smile smile smile smile smile smile smile

‘వైర‌ల్ ప్ర‌పంచం’ మూవీ రివ్యూ & రేటింగ్

సోష‌ల్ మీడియాలో కాలం గ‌డుపుతున్న యువ‌త‌.. వాటిల్లో అశ్ర‌ద్ధ చేస్తూ జీవితాల‌ను ముగించుకుంటున్న ప‌రిస్థితి ఉంది. తాజాగా అలాంటి జోనర్‌లో తెర‌కెక్కిన మూవీ ‘వైరల్ ప్రపంచం’. వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ, నవీన్ ముఖ్య పాత్రల్లో, బ్రిజేష్ టాంగి దర్శకత్వంలో, నిర్మాత అకిల తంగి నిర్మించిన‌ ఈ మూవీ తాజాగా థియేట‌ర్‌ల‌లో విడుద‌లైంది. ఇంత‌కీ ‘వైరల్ ప్రపంచం’ ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌: అమెరికాకు వెళ్లిన స్వప్న (ప్రియాంక శర్మ) అనే అమ్మాయి తన 4 ఏళ్ల సంబంధాన్ని ఏ విధంగానైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. రవి (సాయి రోనక్)తో ప్రేమ‌లో ఉంటుంది. సీన్ క‌ట్ చేస్తే.. ఒంటరిగా జీవిస్తున్న అదితి (నిత్య‌శెట్టి) అనే అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తాను కలిసే ప్ర‌వీణ్‌ (స‌న్నీ న‌వీన్)తో ఎమోష‌న్ బాండింగ్‌ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను, ఇంటర్నెట్‌ను నమ్ముతారు, కానీ వారి నమ్మకాన్ని దెబ్బ‌కొట్టింది ఎవ‌రు? ప్రాణాలను బలిగొన్న ఘ‌ట‌న ఏంటీ? అనేవి తెలుసుకోవాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

‘‘మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా చూస్తాం. కానీ నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు’’ అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి భవనంపై నుండి దూకడంతో ప్రారంభమయ్యే సస్పెన్స్ రిలేషన్ షిప్ డ్రామా. కథ మొత్తం కంప్యూటర్ స్క్రీన్‌లు, వరుస వీడియో కాల్స్, అనేక యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కథనాల సేకరణ, కొన్ని టెక్స్ట్ మెసెస్‌ల ద్వారా జరుగుతుంది. ఈ కథ వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయో దాని గురించి, ఉన్నత చదువుల కోసం ఈ సినిమా సుదూర సంబంధాలను, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నారో చెబుతుంది. ఈ కాలంలో ఇంటర్నెట్‌లో యువతులు, మహిళల గోప్యతను మంట‌గ‌లుపుతున్న‌ సైబర్ నేరాన్ని కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తుంది.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌: ఈ సినిమాలో రెండు జంట‌లు ప‌ర్‌ఫెక్టుగా కుదిరాయి. రవి పాత్ర‌లో సాయి రోనక్, స్వ‌ప్న పాత్ర‌లో ప్రియాంక శర్మ, అదితి పాత్ర‌లో నిత్య‌శెట్టి, ప్ర‌వీణ్ పాత్ర‌లో స‌న్నీ న‌వీన్.. ఈ త‌రం యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా క‌నిపించారు.. ఎంతో నాచుర‌ల్‌గా న‌టించారు. నాలుగు ముఖ్య‌పాత్ర‌దారులు స‌హ‌జ భావోద్వేగాన్ని పండించారు.

సాంకేతిక విభాగం: మ్యూజిక్ ఎంతో ఎమోష‌న‌ల్ ఫీల్ క‌లిగిస్తుంది. ఎడిటింగ్ ప‌ర్‌ఫెక్టుగా కుదిరింది. ఇక కెమెరా ప‌నిత‌నం ప‌ర‌వాలేదు. స్క్రీన్ బేస్డ్‌ను చాలా నాచుర‌ల్‌గా తెర‌కెక్కించారు.

విశ్లేష‌ణ‌:  ‘ఇంటర్నెట్‌లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అనే ఈ సినిమాలోని డైలాగ్ మాదిరిగానే తాను చెప్పాల‌నుకున్న స‌బ్జెక్టును తెర‌కెక్కించ‌డంతో స‌క్సెస్ అయ్యాడు దర్శకుడు బ్రిజేష్ టాంగి. వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్ వల్ల వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది ఈనాటి యువ‌త‌కు అర్థ‌మ‌య్యేలా స్క్రీన్‌పై ఆవిష్క‌రించాడు. కంప్యూటర్ స్క్రీన్‌లపై జరిగే ఒక ఉత్కంఠభరితమైన క‌థ‌నం, ఇది సుదూర సంబంధాలను, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ సంబంధాలు ఎలా ప్రభావితమవుతున్నాయో చెప్పిన తీరు ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌జేస్తుంది. ఈ మూవీని స్క్రీన్ బేస్డ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు బ్రిజేష్ తంగీ.

స్క్రీన్ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల ఎంతోమంది జీవితాలు ఎలా నాశనమయ్యాయి అనేదాని ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ త‌రం యువ‌త‌ను ఆలోచింప‌జేస్తుంది, వారికి ఓ విలువైన సందేశం ఇస్తుంది. యువ‌త‌కు ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది.

రేటింగ్: 3.75 / 5

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *