స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా….
కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంది. రోజురోజుకీ విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఎంతటివారినైనా కరోనా వదలడం లేదు. అది ఏపాటిది అని నిర్లక్ష్యం చేస్తూ మాస్క్ లు ధరించని వ్యక్తులు ఎంతటి వారలైనా కరోనాకు దాసులే అన్నట్లు విజృంభిస్తుంది. ముఖ్యంగా పేద, ధనిక అన్న తేడా లేకుండా కరోనా అందరికీ సోకుతోంది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీ వుడ్ లలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ ఎక్కువవుతుంది.
అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె.. తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అందరికీ తెలపాలని భావించాను. ప్రస్తుతం నియమ నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్భందంలో ఉన్నాను. అలాగే ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ ఇంట్లోనే ఉండండి. కరోనా నుంచి కాపాడుకోండి’ అంటూ ఈ బుట్టబొమ్మ ట్వీట్ చేయడం విశేషం. కాగా పూజా ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, ఆచార్య సినిమాలతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.