లాయర్ గా సూర్య పిక్స్ లీక్… వైరల్..
తెలుగు, తమిళ పరిశ్రమల్లో హీరో సూర్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హీరో సూర్య ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే మంచి టాలెంటెడ్ స్టార్ సూర్య.
అయితే సూర్య త్వరలో లాయర్ అవతారమెత్తనున్నాడు. జ్జానవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజాగా సినిమా ఇది. ఈ సినిమాలో హీరో సూర్య లాయర్ పాత్ర పోషించనున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో లీకైన ఫొటోల ద్వారా బయటకు వచ్చింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ‘కర్ణన్’ ఫేమ్ రజీషా విజయన్ నటిస్తోంది. మరో వైపు సూర్య, పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. మరో వైపు మణిరత్నం రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘నవరస’ లో సూర్య ఎపిసోడ్ ను గౌతమ్ మీనన్ రూపొందిస్తున్నాడు. మొత్తానికి నెట్టింట్లో హీరో సూర్య లాయర్ పిక్స్ వైరల్ గా మారడం విశేషం.