smile smile smile smile smile smile smile smile smile smile smile

టీచర్స్ డే కానుక‌గా నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్ లుక్!

జాతీయ‌ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్ స్కూల్ టీచర్‌గా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టీచర్స్ డే (ఉపాధ్యాయుల దినోత్సవం) సందర్భంగా ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.

 హీరో జయంత్ మాట్లాడుతూ..
“పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లతో పాటు, నేటి విద్యావ్యవస్థ తీరుతెన్నులను ఆవిష్కరించే కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది” అని జయంత్ తెలిపారు.

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ..
“32 అవార్డులతో పాటు నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ గెలుచుకున్న ‘లతా భగవాన్ ఖరే’ తర్వాత నేను దర్శకత్వం వహించిన చిత్రమిది. మలయాళంలో 111 రోజులు ప్రదర్శితమై సంచలన విజయం సాధించిన ‘ఫిలిప్ అండ్‌ ది మంకీ పెన్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. హృదయానికి హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని దర్శకుడు పేర్కొన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ..
“ఉపాధ్యాయుల దినోత్సవం రోజున, ఓ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి చేతుల మీదుగా నేను టీచర్‌గా నటించిన సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నా అదృష్టం” అని నటుడు సత్యం రాజేష్ తెలిపారు.

నిర్మాత దివ్య మాట్లాడుతూ..
“నా దృష్టిలో స్కూల్ ఒక దేవాలయం, ఉపాధ్యాయులే దేవుళ్లు. అందుకే ఈ ప్రమోషన్లను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ సినిమా నిర్మాణం నాకు, నా భర్త ప్రవీణ్‌కు ఎంతో గర్వకారణంగా అనిపిస్తోంది” అని నిర్మాత దివ్య బొలిశెట్టి చెప్పారు.

నటీనటులు: జయంత్, తనికెళ్ల భరణి, సత్యం రాజేష్, మానస రాధాకృష్ణన్, ఆశిష్ గాంధీ, కాశీ విశ్వనాథ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

సంగీతం: మోహిత్ కులకర్ణి
ఛాయాగ్రహణం (DOP): ఆండ్రూ బాబు
కథనం, మాటలు & పాటలు: ప్రవీణ్ బొలిశెట్టి
కూర్పు (Editing): నందమూరి హరి తారక రామారావు
ఆర్ట్ డైరెక్టర్: నాని
నిర్మాత: దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
దర్శకత్వం: నవీన్ దేశబోయిన

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *