బాహుబలి – 100 కోట్లు వేస్ట్ – మళ్లీ తీయండి!
బాహుబలి రికార్డ్స్ ని తిరగరాయడం అనేది ఇప్పుడు ఏ సినిమాకి లేదనే చెప్పాలి. బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమాని షేక్ చేశాయి. మార్కెట్ పరంగా కూడా హైఎస్ట్ వసూళ్లని సాధించాయి. అందుకే, నెట్ ఫ్లిక్స్ బాహుబలి అసలు ఎలా మొదలైంది. శివగామి పాత్ర ఎలా పుట్టింది ? మాహిష్మతి సామ్రాజ్యపు అసలు కథేంటి అనేది వెబ్ సీరిస్ గా రూపొందిచాలని ప్రొడ్యూసర్స్ తో ఒప్పందం చేస్కుంది. దీనికోసం సదరు ప్రొడ్యూసర్స్ 9 ఎపిసోడ్స్ వెబ్ సీరిస్ ని తీశారు. కానీ ఇది అనుకున్నంత రేంజ్ లో లేదట.
ఈ సీరిస్ కి ‘బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్’ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్‌ను భారీ స్థాయిల్ షూట్ చేశారు. కానీ ఫైనల్ కట్ చూసేసరికి అంతా చెత్తచెత్తగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజే కాని నెట్‌ఫ్లిక్స్ ఈ 9 ఎపిసోడ్లు చూసి అస్సలు బాగోలేదని నిర్ణయానికి వచ్చిందట. క్వాలిటీ విషయంలో మేకింగ్ విషయంలో బాగా కాంప్రమైజ్ అయ్యారని, ఇలా చేస్తే ఈ సీరిస్ కి కనీసం వ్యూస్ కూడా రావని భయమేసిందని చెప్తున్నారు. అందుకే, ఆ ఎపిసోడ్లన్నింటినీ క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.
నిజానికి ఈ సిరిస్ కోసం 100 కోట్లు ఖర్చు చేశారు. ఈ 100 కోట్లు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ ఈ సీరిస్ కోసం 200 కోట్లు మళ్లీ తిరిగి కేటాయించి ఈ ఎపిసోడ్స్ ని ఫినిష్ చేయమని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు ఈ సిరీస్ బడ్జెట్ లెక్కలు మూడు వందల కోట్ల రూపాయల వరకూ ఖర్చు అయ్యే పరిస్తితి నెలకొంది. మరి ఇప్పటికైనా సరే బాహుబలి అండ్ టీమ్ ఈ సీరిస్ కి తగిన న్యాయం చేస్తారా లేదా అనేది చూడాలి.
ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నవారిలో రాజమౌళి కూడా ఉండటం విశేషం.