గోపిచంద్ మరోసారి అదే ప్రయోగం…
యాక్షన్ హీరో గోపిచంద్ మరోసారి తన ద్విపాత్రాభినయం అనే ప్రయోగంతో అలరించనున్నారు. తన కెరీర్ లో ఒకే ఒక సారి ద్విపాత్రాభినయం చేశాడు గోపిచంద్. ‘గౌతమ్ నందా’ పేరుతో రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ద్విపాత్రాభినయం అనే ప్రయోగాన్ని సాహసంతో చేయబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ లో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ లో మెరవపబోతున్నట్లు తెలుస్తోంది. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి ముప్పై ఏళ్ల తర్వాత శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. నిజానికి గోపీచంద్ కి నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజనే. ‘జయం’ సినిమాతో గోపిచంద్ కి హిట్ ఇచ్చిన తేజ ఆ తర్వాత తనతో ‘నిజం’లో కూడా విలన్ పాత్ర పోషింప చేశాడు.
అంతేకాకుండా ఆ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కలయిలో ఓ సినిమా ఈ విధంగా రానుండటం విశేషం. ఇప్పుడు తేజ, గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు టాక్. మరి రెండో సారి ద్విపాత్రాభినయం చేయబోతున్న గోపీచంద్ ఈ సారైనా ఈ ప్రయోగంతో హిట్ ఏ విధంగా కొడతాడో మరి వేచి చూడాలి.