మలైకా వేలికి ఉంగరం…. రచ్చ రేపుతోందిగా…
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఒకప్పుడు ‘ఛయ్య.. ఛయ్య.. ఛయ్యా చయ్యా’ అంటూ నడుమూపి కుర్రకారు మతులు పోగొట్టింది. అయితే 48 ఏళ్ల వయసులోను ఇప్పటికీ అదే అందంతో దూకుడు మీదుంది మలైకా. అలాగే టాలీవుడ్ లో కూడా ‘అతిథి’ సినిమాలో ‘రాత్రైనా నాకు ఓకే..’ గబ్బర్ సింగ్ సినిమాలో ‘కెవ్వుకేక.. అంటూ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించింది.
ఇక మలైకా వ్యక్తిగత జీవితానికి వస్తే.. 1998లో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్ఫాజ్ ఖాన్ను పెళ్లి చేసుకుంది. 19 ఏళ్ల పాటు కలిసున్న ఈ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే 2017లో విడిపోయారు. ప్రస్తుతం మలైకా, బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం సాగిస్తుందన్నది బహిరంగ రహస్యమే. వీరిద్దరు కలిసి పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటం విశేషం.
అంతేకాకుండా త్వరలోనే మలైకా, అర్జున్ కపూర్లు పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో మలైకా రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో చేతికి డైమండ్ రింగ్ ధరించిన ఫొటోలు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చోపచర్చలకు దారితీస్తుంది. ఇదే సమయంలో అందరు ఆమెకు అర్జున్ కపూర్తో నిశ్చితార్థం అయిందని అనుకున్నారు. కాని అసలు విషయం ఏంటంటే..? ఓ జ్యువెలరీ బ్రాండ్ను ప్రమోట్ చేసే క్రమంలో మలైకా రింగ్ ధరించి ఫొటోస్ షేర్ చేసిందనేదే వాస్తవమని సమాచారం. మొత్తానికి ఫ్యాన్స్ ని కూడా మలైకా మస్కా కొడుతుందన్న మాట.