సురేష్ బాబు సూచనతో నారప్ప రీషూట్…
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ ను పోషిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘నారప్ప’. తమిళంలో భారీ హిట్ కొట్టిన ‘అసురన్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ‘నారప్ప’గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. తాజాగా సురేష్ బాబు ‘నారప్ప’లో కొన్ని మార్పులను సూచించినట్లు తెలుస్తోంది.
అదేవిధగా ‘నారప్ప’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఈ మధ్య మాట్లాడిన సురేష్ బాబు ఫైనల్ కట్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ‘నారప్ప’కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మే 14వ తేదీన విడుదల కాబోతుంది. కాగా సమాజంలోని అసమానతలు, చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో సురేష్ బాబు తగు జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేష్ ‘ఎఫ్ 3’, ‘దృశ్యం 2’ సినిమాలతో కూడా చాలా బిజీగా గడుపుతుండటం విశేషం.