smile smile smile smile smile smile smile smile smile smile smile

Bigg Boss సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు. దీంతో ఇకపై ఓటీటీ వెర్షన్ ఉంటుందా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 6ని మరికొన్ని రోజుల్లో మొదలుపెట్టనున్నారు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ షో మొదలుకానుంది. దానికోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న లిస్ట్ ప్రకారం.. ఆ సెలబ్రిటీలెవరంటే..? యాంకర్ వర్షిణి, నటి నవ్యా స్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్, ఆదిలను షో నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. దాదాపు వీరిని ఫైనల్ చేసినట్లు సమాచారం. అలానే బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించనున్నారు. యాంకర్ శివ, మిత్రాశర్మ, అనిల్ రాథోడ్ లాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించే ఛాన్స్ ఉంది.

You may also like...

1 Response

  1. vorbelutrioperbir says:

    I’ve read a few good stuff here. Certainly value bookmarking for revisiting. I wonder how much effort you set to create this kind of excellent informative web site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *