మే 14న ఓటిటిలో విజయ్ సేతుపతి సినిమా….
డైరెక్టర్ విజయ్ చందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రలతో చేసిన తమిళ సినిమా ‘సంగతమీజన్’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. అయితే వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి.శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.
అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘విజయ్ సేతుపతి’ సినిమా తాజాగా తెలుగు ఓటిటి వేదికపై విడుదలకు రెడీ ఆయింది. ఆహాలో మే 14న ‘విజయ్ సేతుపతి’ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ‘విజయ్ సేతుపతి’ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం విజయ్ సేతుపతికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ బాగుంది. ఈ మధ్యనే ‘ఉప్పెన’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు విజయ్ సేతుపతి. కాగా విజయ్ సేతుపతి ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే… మరోవైపు క్రేజీ విలన్ పాత్రలను కూడా పోషిస్తుంటడం విశేషంగా చెప్పవచ్చు.