smile smile smile smile smile smile smile smile smile smile smile

‘రెచ్చిపోదాం బ్రదర్’.. అంటూ జూన్ 10న వ‌చ్చేస్తున్నారు!

ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతూ మ‌రో సినిమా వ‌చ్చేస్తోంది. ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 10న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జంపన్న మాట్లాడుతూ.. ‘‘మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. మా కథకు తగ్గ ఆర్టిస్టులు కుదిరారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. సాయి కార్తీక్ సంగీతం, శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ, ఈ చిత్రం అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది’’ అని అన్నారు.

చిత్ర హీరో రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. నాతో పాటు అతుల్ కులకర్ణి, పోసాని, భాను చందర్, ఇంద్రజ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఎందరో నటించారు. ఈ చిత్రంలో పాటలు చాలా ట్రెండీగా, కొత్తగా ఉంటాయి. మా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ప్రేక్షకులను మా చిత్రం మెప్పిస్తుందని ఆశిస్తున్నా..’’ అన్నారు.

చిత్ర నిర్మాత హనీష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వ‌చ్చింది. జూన్ 10న విడుద‌ల చేయ‌బోతున్నాం. నేటి యువత‌ను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో మా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. విడుద‌ల త‌ర్వాత మా సినిమాకు భారీ రెస్పాన్స్ రావ‌డం ఖాయం’’ అన్నారు.

రవికిరణ్, అతుల్ కులకర్ణి, దీపాలి శర్మ, శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి; డి.ఓ.పి: శ్యాం.కె. నాయుడు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్: మహేష్ శివన్, డాన్సు: భాను, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, ప్రొడ్యూసర్స్: వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు, స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏ. కె. జంపన్న.

You may also like...

1 Response

  1. vorbelutr ioperbir says:

    I respect your piece of work, thankyou for all the good articles.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *