నల్లమల నుంచి నాజర్ లుక్ వైరల్…
టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు, మరెన్నో పాత్రలు పోషించారు నాజర్. అయితే ప్రస్తుతం ఓ సినిమాలో సైంటిస్ట్ గా కనిపించనున్నాడు. ఆ సినిమా పేరే ‘నల్లమల’. ఇందులో నాజర్ లుక్ ను ఈరోజు సినిమా బృందం విడుదల చేసింది.
అయితే అటవీ నేపథ్యం, వాస్తవ ఘటనల ఆధారంగా ఈసినిమాని తీస్తున్నట్లు దర్శకుడు రవి చరణ్ వెల్లడించారు. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని సినిమా యూనిట్ వెల్లడిస్తుంది. కాగా అసాధారణ మేథస్సు గల ఓ సైంటిస్ట్ ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలని తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుంటాడు. అందులో భాగంగా అక్కడ అతను ఎమేం ప్రయోగాలు చేశాడు. ఏమి కనుగొన్నాడు. ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగింది అనేది ప్రథానాంశంగా ‘నల్లమల’ తెరకెక్కుతుంది అన్నాడు దర్శకుడు. ఈ సినిమాకి ఆర్.ఎం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.