smile smile smile smile smile smile smile smile smile smile smile

జనసేనానికి కరోనా… ఫామ్ హౌస్ లోనే చికిత్స..

జనసేనానికి పవన్ కల్యాణ్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. అస్సలు కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. ఈ సెకండ్ వేవ్ ప్రజల్లో తిరిగే ప్రముఖుల అందరికీ చాలా వరకు సోకుతుండటం ఆందోళన కలుగుతుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కరోనా వైరస్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అయితే మొదటి సారిగా ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి. కానీ.. అప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్ లోనే హోం క్వారంటైన్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెట్టడంతో.. రెండో రోజుల క్రితం మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఈసారి కరోనా పాజిటివ్గా తేలింది అని జనసేన పార్టీ ప్రకటించింది.
అయితే పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ లోనే హోం క్యారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్.. హైదరాబాద్కు వచ్చి పవన్ కల్యాణ్కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరకోవడంతో.. యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని.. అవసరం మేరకు ఆక్సిజన్ కూడా అందిస్తున్నామని జనసేన తన ప్రకటనలో వెల్లడించింది. అలాగే చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యంపై వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని.. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కల్యాణ్ను పరీక్షించిందని.. జ్వరం, ఊపిరితిత్తుల్లోని నెమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారని తెలుస్తోంది. అయితే తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారని ప్రకటన ద్వారా తెలిపింది జనసేన పార్టీ.

Type a message

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *