ఐసోలేషన్ లోకి మహేష్ బాబు… స్టైలిస్ట్ కు కరోనా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెట్లో మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో డాక్టర్ల సలహా మేరకు మహేష్ బాబు ఐసోలేషన్ లో ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా మహేష్ బాబు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి గత వారం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు వ్యక్తిగత స్టైలిస్ట్ కు కరోనా సోకింది. దీంతో అతనితో పాటు చిత్రబృందంలోని నలుగురికి ఒకేసారి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చిత్రయూనిట్ సినిమా షూటింగ్ ను వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు ఇంట్లోనే ఐసోలేషన్ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన ఫ్యాన్స్ కు కరోనా సోకకుండా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.