యజ్ఞంలా పారిశుద్ద్యం కార్యక్రమాలను పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, జూన్ 19: జిల్లాలోని రూరల్, అర్బన్ ప్రాంతాలలో పారిశుద్ద్య కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి రోజు ఒక యజ్ఞము ల పనులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం పారిశుద్ద్య కార్యక్రమాలు, హరితహారం పనుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు ఇళ్లనుండి చేత్తను తడిపొడిగా వేరుచేసి సేకరించాలని, మురుగు కాలువలను శుభ్రం చేయడానికి అవసరమైన లేబర్ అదనంగా డైలీ వెజిస్ క్రింద ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీధులలో ప్రజలు చెత్తను చెత్తకుండీ లలో మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పటిష్ట పారిశుద్ద్య, స్వచ్చతలో ముందుండేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితిలకు ట్రాక్టర్ లు, ట్యాంకర్లు ను మంజూరు చేయడంతో పాటు ప్రతినెల బడ్జెను కూడా కేటాయిస్తుందని పేర్కోన్నారు.
జిల్లాలోని అన్ని రహదారుల వెంట ఇరువైపులా ఎవెన్యూ ప్లానిటేషన్ జరిగాలని, మొక్కలను నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి బ్రతికేలా ట్యాకర్ల ద్వారా క్రమం తప్పకుండా ప్రతి నిత్యం నీటిని అందించడం, చనిపోయిన మొక్కల స్థానంలో వెరె మొక్కలను నాటడం, ఇళ్లు, దుఖానాల ముందు ఉన్న మొక్కల సంరక్షణ బాద్యతలను ఇంటి యజమానులు, షాపు నిర్వహకులకు బాద్యులను చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిండం, వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు కాలువలలో పడేయకుండా, చెత్త డబ్బాలలో వాడిపడెసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైకుఠదామాల చుట్టు గ్రీన్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయలని, రోడ్లు, వీదులు ఇతర ప్రదేశాలలో మొక్కలు నాటడం కొరకు జరిగే పిట్టింగ్ గుంతలు తొవ్వడం వంటి పనులు అలస్యంగా జరుగుతున్నాయని, నిర్ణిత సమయంలో లక్ష్యాన్ని అదిగమించేలా ప్రణాళికను రూపొందించి వారంలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కోన్నారు.
పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు ఉండాలని, ఎక్కడా కూడా మొక్కలు తక్కువ కాకుండా జాగ్రత్తపడాలని, నర్సరీలు ఏర్పాట చేసిన చోట నేమ్ బోర్డు లు, రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించాలని, పనులు పూర్తయ్యే వరకు ఎవరికి సెలవులు మంజూరు చేయరాదని అధికారులను ఆదేశించారు. పై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడునని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోబడునని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు శ్రీమతి మాదురి, వినోద్ కుమార్, యంపిడిఓ, యంపిఓ, మండల ప్రత్యేక అధికారులు పాల్గోన్నారు.