Brahmanandam: బ్రహ్మానందం ఆస్తులు.. స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోరు!
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.. కామెడీకి కేరాఫ్ అడ్రస్. తెరమీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్‌లో నవ్వులు విరబూస్తాయి. ఆయన పేరు తలుచుకున్నా సరే పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన బ్రహ్మానందం తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో చక్కిలిగింతలు పెట్టిస్తారు. అందుకే ఈమధ్య ఆయన సినిమాలు తగ్గించినా సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు.
సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్ అసామాన్యమైంది. ఎందుకంటే బ్రహ్మీ లేని మీమ్స్ ఊహించడం కూడా కష్టమే. ఆయన స్టైల్‌లో చెప్పే డైలాగులు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఇండస్ట్రీలో కామెడీ కింగ్‌గా సుమారు 1250కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 2010 లో గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. సినిమా ఎలాంటిదైనా అందులో బ్రహ్మీ మార్క్ ఖచ్చితంగా కనపడుతుంది.
అందుకే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుదన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిబడి పెట్టిన బ్రహ్మానందం ఆస్తుల విలువ సుమారు రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
I have been browsing on-line greater than three hours nowadays, but I by no means discovered any fascinating article like yours. It¦s lovely value enough for me. In my opinion, if all website owners and bloggers made just right content as you probably did, the internet shall be a lot more useful than ever before.