IPL లైవ్ ఫ్రీగా చూడాలంటే ఇలా చేయండి
IPL పండగ హడావిడి మొదలైపోయింది. 2021 ఐపీఎల్ టోర్నీ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. తొలి మ్యాచ్‌లోనే రోహిత్ వర్సెస్ కోహ్లీ పోరుతో ఈ టోర్నీ ప్రారంభం కాబోతోంది. మరి ఇంత స్థాయిలో క్రేజ్ ఉన్న ఈ టోర్నీని ఆన్‌లైన్‌లో లైవ్ చూడాలంటే మాత్రం ఎంతో కొంత చెల్లించుకోవాల్సిందే. దానికి తోడు నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాల్సిందే. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఐపీఎల్ లైవ్‌లో ప్రసారం కానుంది. సాధారణంగా ఇందులో మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలంటే ప్రతీ నెలా 399 రూపాయలు చెల్లించాల్సిందే. అయితే ఎయిర్‌టెల్, జియో కస్టమర్లయితే మాత్రం ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం ఉంది. తమ వినియోగదారుల కోసం ఈ టెలికం కంపెనీలు డిస్నీ+హాట్‌స్టార్‌కు ఉచిత చందాతో కూడిన ప్రత్యేక రీచార్జ్‌లను అందిస్తున్నాయి.
దీనివల్ల మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. అలాగే మీరు ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటంటే.. 401, 499, 599, 777, 2,599 ప్లాన్స్‌లో ఆయా ప్లాన్స్ ప్రకారం ప్రతి రోజూ ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మెసేజింగ్ సర్వీసెస్‌ను రిలయన్స్ జియో తమ వినియోగదారులకు అందిస్తోంది. వాటి ద్వారా డిస్నీ+హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను ఆయా ప్లాన్‌ల వ్యాలిడిటీ ప్రకారం అందిస్తోంది. ఇక ఎయిర్‌టెల్ కూడా తమ వినియోగదారులుకు 401, 448, 499, 599, 2,698 రీఛార్జ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కస్టమర్లు రీఛార్జ్ ప్లాన్‌లతో డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అలాగే ఉచిత వాయిస్ కాల్స్, డేటా, SMSలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ కింద లభిస్తాయి.