దుమ్ములేపేశావ్ జక్కన్నా.. RRR చూసిన చిరు
డైరెక్టర్ రాజమౌళి బిగ్ ప్రాజెక్టు త్రిపుల్ ఆర్ మూవీ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మరోవైపు ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ అయితేనేం అదిరిపోయాయి. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అని వేయికళ్లతో సినీ ప్రియులు.. ఇటు నందమూరి ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.
ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్-13న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే దాదాపు షూటింగ్.. మరోవైపు ఎడిటింగ్ కూడా దాదాపు అయిపోవడంతో అసలు సినిమా ఎలా ఉందో..? చూడాలని టాలీవుడ్ పెద్దన్న, మెగాస్టార్ చిరంజీవికి జక్కన్న చూపించారట. ఈ సినిమాలో కొన్ని కొన్ని కీలకమైన సీన్లను మాత్రమే చూసిన మెగాస్టార్.. వావ్ అదిరిపోయిందంటూ కితాబిచ్చారట. నిజంగా ఇంతవరకూ ‘బాహుబలి’ సినిమా అనుకుంటే అంతకంటే మించిపోయిందంటూ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తారట. ఇక చెర్రీ, తారక్ యాక్టింగ్‌ల గురించి మాట్లాడుతూ.. అసలు ఈ రేంజ్‌లో వీరిద్దర్నీ చూపిస్తావని అనుకోలేదని.. నిజంగా దుమ్మెలేపేశావ్ పో అంటూ తన ఆనందాన్ని రాజమౌళి, తన అత్యంత సన్నిహితులతో చిరు పంచుకున్నారట.
నిజానికి మెగాస్టార్ తన సినిమాల విషయంలో అంత సీరియస్‌గా తీసుకుంటారో లేదో గానీ చెర్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే రిలీజ్‌కు ముందే కచ్చితంగా.. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే సినిమా చిరుకు చూపించి తీరాల్సిందే. అందుకే తాజాగా.. మెగాస్టార్‌కు జక్కన్న సినిమా చూపించక తప్పలేదు. సినిమాలోని కొన్ని కొన్ని కీలక సీన్లను మాత్రమే చూసి సంబరపడిపోయిన చిరు.. ఇక సినిమా మొత్తం చూస్తే చిరు ఎలా రియాక్ట్ అవుతారో ఇక చెప్పక్కర్లేదేమో. గతంలో ‘మగధీర’ సినిమా విషయంలోనూ మెగాస్టార్ ఇలానే చూసి కచ్చితంగా ఎవరూ ఊహించని రీతిలో సూపర్ హిట్టవుతుందని చెప్పారు.. అన్నట్లుగానే సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. తాజాగా.. త్రిపుల్ ఆర్ చూసిన తర్వాత కూడా పక్కాగా చరిత్ర సృష్టించడం ఖాయమని మెగాస్టార్ చెప్పాడట. ఒక్క చిరు అన్నారనే కాదు కానీ ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయ్.. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాతో జక్కన్న తన రికార్డులు తనే తిరగరాస్తారేమో చూడాలి.