కియారా అద్వానీ భారీగా డిమాండ్….
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు పరిచయం అయిన కైరా అద్వాని… తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందే బాలీవుడ్ లో ‘ఫగ్లీ’, ‘ఎం.ఎస్. ధోని’, ‘మిషన్’ సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలతో రాని గుర్తింపు ‘భరత్ అనే నేను’తో కైరాకు వచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత అమ్మడు చేసిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సీరీస్ యూత్ లో ఎనలేని క్రేజ్ ని తెచ్చి పెట్టింది. కానీ రామ్ చరణ్ తో నటించిన ‘వినయవిధేయ రామ’ పరాజయం పొందటంతో తెలుగు నిర్మాతలు ఒకింత వెనుకంజ వేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్, గుడ్ న్యూజ్, అంగ్రేజీ మీడియమ్, లక్ష్మీ, ఇందూకి జవాని’ సినిమాలు కైరా ఇమేజ్ ని మరింత పెంచాయనే చెప్పాలి. ఇప్పుడు కైరాను మళ్ళీ టాలీవుడ్ కి తీసుకువచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
అయితే అమ్మడు ఇప్పుడు తన పారితోషికం భారీగా పెంచేసిందనే టాక్ నడుస్తోంది. ఏకంగా రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి చరణ్ సరసన కైరాను నటింపజేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారట దిల్ రాజు. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తాను తీయబోయే పాన్ ఇండియా సినిమాలో కైరాను ఎంపిక చేయాలనుకుంటున్నారు దిల్ రాజు. కాగా ప్రస్తుతం కైరా నటించిన ‘షేర్ షా’ విడుదలకు రెడీగా ఉంది. ‘భూల్ బులయ్యా2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లేలే’ షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరి కైరా పారితోషికానికి భయపడకుండా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.
buy cialis online forum Statistics 2 tailed t test
diflucan cream otc
buy levitra online australia
prednisone 50 mg