smile smile smile smile smile smile smile smile smile smile smile

ప్రణాళికాబద్ధంగా 7వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, జూన్ 19: జిల్లాలో పల్లెల నుండి పట్టణాల వరకు చేపడుతున్న 7వ విడత హరితహారం కార్యకమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.

శనివారం జగిత్యాల నుండి దర్మపురి నియోజక వర్గంలో చెపడుతున్న హరితహారం కార్యక్రమ పనుల ప్రగతిని పరిశీలించారు. మొదటగా జగిత్యాల నుండి ధర్మపురి వరకు గల జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 కి ఇరువైపులా ఉపాధిహామీ కూలీల ద్వారా మొక్కలు నాటడం కొరకు తవ్వుతున్న గుంతల పనులను పరిశీలించి, మొక్కలను రోడ్డుకు దగ్గరగా, కాకుండా కొంత దూరంలో నాటాలని, గతంలో నాటిన మొక్కల మధ్య ఎక్కువ దూరం లేకుండా గుంతలను ఏర్పాటు చేయాలని, నాటే మొక్కల సైజులను బట్టి గుంతలను పెద్దవిగా తవ్వాలని ఆదేశించారు.

అనంతరం బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామం లో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి అందులో నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు వివిధ రకాలుగా మొక్కలు పెంచడం సంతృప్తికరంగా ఉందని పంచాయతీ సెక్రటరీని అభినందించారు.

ధర్మపురి నుండి వెల్లటూరు ఎస్.హెచ్. 7 నుండి రాజరంపల్లి, గొల్లపల్లి, జగిత్యాల మార్గమధ్యలో రహదారులకు ఇరువైపులా చేపడుతున్న గుంతల పనులను మరియు ఏడో విడత హరితహారంలో నాటవలసిన మొక్కల వివరాలను పరిశీలించారు. చేపడుతున్న పనుల వివరాలు ఎంపిడిఓ ద్వారా అడిగి తెలుసుకొని పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో పి డి డి ఆర్ డి ఏ వినోద్ కుమార్, బుగ్గారం మండల ప్రత్యేక అధికారి, డి.ఎం. మార్కెటింగ్, పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *