smile smile smile smile smile smile smile smile smile smile smile

పవన్ తో సినిమా చేయడం నాకు చేతకాదు: ఆర్జీవీ

సంచలనాత్మక దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రస్తుతం ‘దెయ్యం’ సినిమా ప్రమోషన్లో చాలా బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది కూడా. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్సాబ్’ సినిమా చూశారా..? అని ప్రశ్నించగా.. పవన్ హీరోగా తనకు సినిమా చేయడం రాదని వర్మ అన్నారు. అలాగే ‘వకీల్సాబ్’ సినిమా కూడా చూడలేదని… కానీ.. ట్రైలర్ మాత్రం బాగా నచ్చిందని వర్మ వివరించారు. అంతేకాకుండా పవన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, హీరోయిజం, అభిమానుల అంచనాలకు తగ్గట్టు కమర్షియల్ హంగులతో సినిమా చేయలేనని స్పష్టం చేశాడు. కాగా హీరోయిజం చూపించే కమర్షియల్ సినిమాల కంటే ఎక్కువగా జోనర్ చిత్రాలు చెయ్యడానికే తనకు ఎక్కువ ఆసక్తి అంటూ ఆర్జీవీ వివరించారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *