పుష్ప తర్వాత సుకుమార్ రౌడీ హీరోతో..!
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో బన్నీ.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అదేవిధంగా ఈ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ ఏ హీరోతో సినిమా చేయనున్నాడు అనే వార్తలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమా? కాదా? అనే విషయం తెలియాలంటే మరికొద్దు రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్- విజయ్ కాంబినేషన్ ఉండనుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.