smile smile smile smile smile smile smile smile smile smile smile

పవన్ రాజకీయ వ్యూహం మారబోతోందా..? ఆ పార్టీకి షాకివ్వబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పై హాట్ హాట్ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన నిర్ణయాలు, పర్యటనలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. 2014 ఎన్నికల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్…. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఓ సారి టీడీపీ (Telugu Desham Party), బీజేపీ (BJP) కూటమిని గెలుపు కోసం ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. 2019లో పోటీకి దిగి ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చింది. పరిస్థితికి అనుగుణంగా పవన్ తనవ్యూహాన్ని మార్చుకుని ప్రజల వద్దకి వస్తానని గతంలోనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ రాజకీయంగా ఎత్తుగడ వేసేందుకు సిద్ధం అవుతున్నారట. జనసైనికుల్లో పవన్ తీసుకోబోతున్న నిర్ణయంపై చర్చ సాగుతోంది. పొలిటికల్ పార్టీలలో సైతం ఆ అంశం పదే పదే ప్రస్తావనకు వస్తోంది. అసలు పవన్ స్ట్రాటజీ ఏంటి…? పొలిటికల్ నగర్ లో పవన్ పై సాగుతున్న కథ ఏంటి..?

పవన్ 2014 ఎన్నికల్లో బిజెపి ., టీడీపీ పార్టీలకు మద్దతు పలికి పోటీకి దూరంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక…. ప్రభుత్వ వైఫల్యాలు జనసేన మెడకు చుట్టుకున్నాయి. దీంతో జనసేనాని టీడీపీతో పాటు బీజేపీతో పొత్తుకు కటీఫ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఒక్క స్థానానికే పరిమిత అయ్యారు. ఆ ఓక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి మద్దతు తెలపడంతో.., జీరో అయ్యారు.

ఇక బీజేపీతో మళ్లీదోస్తీ కట్టిన పవన్., ఆ పార్టీతో ప్రయోజనం లేదన్న భావనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, స్టీల్ ప్లాట్ ప్రైవేటీకరణ, గ్యాస్, పెట్రోల్ వంటి ధరలపై రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత రావడం వంటి అంశాలు పవన్ చర్చిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీ చేసినా.., టీడీపీతో జతకట్టినా తనకే దెబ్బ పడుతుందని భావిస్తున్నారట.

పవర్ స్టార్ అని పిలవకండి పవర్ లేదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు పన్నుతున్నారట. ఎన్నికల నాటికి పొత్తులకు గుడ్ బై చెప్పి ఒంటరిగానే పోటీ చేయాలనీ భావిస్తున్నారట పవర్ స్టార్… ఆ దిశగానే సన్నద్ధం అవలంటూ పార్టీకి ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. ఐతే ఇటీవల జనసనే, టీడీపీ మళ్లీ చేతులు కలపబోతున్నాయన్న ప్రచారం సాగుతోంది. పార్టీ ఏర్పడిన తర్వాత మూడు విభిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల నాటికి ఒంటరిగా బరిలో దిగుతారన్న ప్రచారం నిజమేనా..? ఒంటరిగా వైసీపీని ఢీ కొట్టే వ్యూహాలను ఆయన అమలుచేస్తారా..? అనేదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *